
హైదరాబాద్ సిటీ నగరంలో వర్ష పడితే చాలు రోడ్లు జలమయం అయిపోతాయి. వాహనాలు ఎక్కడిక్కడే నిలిచియి, ట్రాఫిక్ అస్తవ్యస్తం అవుతుంది. కాలు లోతు నీటిలో జనాలు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే కర్ణాటక రాజధాని నగరం అయిన బెంగళూరులో వర్షం పడితే ట్రాఫిక్ సమస్యలు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సొంత వాహనాలు ఉన్నవాళ్లే ఇబ్బందుల్లో పడుతుండగా, బస్సులు ఇంకా ఇతర వాటి పై ఆధారపడేవారి బాధ మాటల్లో చెప్పలేనిది. వర్షం పడితే చాలు ఉబర్ ఆటో సర్వీస్ కిలోమీటరుకు వందలకి వందలు వసూలు చేస్తున్నాయి. అయితే ఉబర్ యాప్‌లో ఆటో చూపించిన ధర ఒక వ్యక్తిని షాక్‌కు గురిచేసింది.
బెంగళూరులో ఓ వ్యక్తి సాయంత్రం వర్షం పడుతుండగా ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. క్యాబ్ బుక్ కావడానికి చాల సమయం పడుతుండటంతో ఉబర్ ఆటో యాప్ ట్రై చేయగా కిలోమీటరు దూరానికి రూ.425 చూపించింది. దింతో ఉబర్ ఆటో ఛార్జ్ చూసి ఆశ్చర్యపోయిన అతను యాప్ స్క్రీన్‌షాట్ తీసి Redditలో షేర్ చేసాడు.
ఉబర్ ఆటో చాలా కాస్ట్లీ: వర్షాకాలంలో కేవలం 1 కి.మీకి ఉబర్ ఛార్జీలు అనే క్యాప్షన్ పెట్టి ఈ ఫోటో పోస్ట్ పెట్టారు. దింతో ఇది తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆటో ఛార్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఒక కిలోమీటరుకు ఆటో ప్రయాణం ఇంత కాస్ట్లీ ఆహ్... ప్రజలు ఎలా ప్రయాణించగలరు అని ప్రశ్నిస్తున్నారు. ఒకతను నేనైతే రూ.425 ఛార్జీ బదులు ఒక గొడుగు కొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని అని కామెంట్ చేసాడు.
బెంగళూరు లాంటి మహానగరంలో రద్దీ సమయాల్లో ఇంకా వర్షం పడుతున్నప్పుడు ప్రైవేట్ రవాణా ఛార్జీలు చాల ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను మొదటి నుండి ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది చాల బాధాకరమైన విషయం అని కొందరు ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.