
కాగజ్ నగర్, వెలుగు : నిలిపి ఉంచిన కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.45 లక్షలు చోరీ చేశారని ఓ బాధితుడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. టౌన్ సీఐ స్వామి కథనం ప్రకారం..పట్టణంలోని మౌంటెయిన్ టవర్స్ కు చెందిన రాపల్లి సత్యనారాయణ అమెరికాలో ఐటీ జాబ్చేస్తూ ఇటీవలే కాగజ్నగర్వచ్చాడు. మంగళవారం రాత్రి తన కారులో శ్రీనగర్ కాలనీలో ఉండగా..ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారు వెనక సీట్లో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లిపోయారని పీఎస్లో కంప్లయింట్ఇచ్చాడు. అయితే, ఈ నగదు ఎక్కడిది? రాత్రి సమయంలో అంత నగదుతో ఎందుకు ఉన్నారనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఐ స్వామి తెలిపారు.