స్కూటీలో పెట్టిన 5లక్షలు మాయం

స్కూటీలో పెట్టిన 5లక్షలు మాయం

కాజీపేట, వెలుగు: బ్యాంకులో డాక్యుమెంట్ల చలాన్లు కట్టేందుకు స్కూటీలో పెట్టిన రూ.5 లక్షలు చోరీకి గురైన ఘటన కాజీపేట పీఎస్​లో జరిగింది. ఎస్సై ప్రమోద్ కుమార్ వివరాల ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన పూల రాజు, గుండు శ్రీనివాస్ సిటీలోని పద్మ అరవింద్ అనే అడ్వకేట్ వద్ద అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం డాక్యుమెంట్లకు సంబంధించిన చలాన్లు కట్టమని అడ్వకేట్​ పద్మ​అరవింద్.. రాజు, శ్రీనివాస్ కు రూ.5లక్షలు ఇచ్చారు.

వాటిని తీసుకుని ఇద్దరూ వడ్డేపల్లి ఎస్బీఐ బ్రాంచ్​కు వెళ్లారు. సర్వర్ బిజీగా ఉందని బ్యాంక్​ సిబ్బంది చెప్పడంతో రాజు డబ్బును స్కూటీ డిక్కీలో పెట్టుకుని ప్రశాంత్ నగర్​లోని రిజిస్ట్రేషన్ ​ఆఫీసుకు వెళ్లాడు.తర్వాత సిటీలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాడు. రాత్రి 7.30కు ఇంటికి వచ్చిన రాజు డిక్కీ ఓపెన్ ​చేసి చూడగా డబ్బు కనిపించలేదు. వెంటనే బాధితుడు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.