కరోనా పంజా.. ముంబైలో ఒక్కరోజే 10,860 కేసులు

కరోనా పంజా.. ముంబైలో ఒక్కరోజే 10,860 కేసులు

కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి ఉధృతి నేపథ్యంలో  మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది.  పూణేలో రేపటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ.500, బహిరంగంగా ఉమ్మివేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని  డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. అలాగే  పూణేలో 1 నుంచి 8 తరగతల లోపు స్కూల్స్ జనవరి 30 వరకు  మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్ లైన్ లో క్లాసులు కొనసాగుతాయన్నారు అజిత్ పవార్. మరో వైపు ఇవాళ ఒక్కరోజే ముంబైలో 10,860 కోవిడ్  పాజిటివ్ కేసులు .. పూణెలో 1104 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.