రక్షణ శాఖలో రూ.7వేల 800 కోట్ల ఆయుధాల కొనుగోలుకు గ్రీన్​సిగ్నల్​

రక్షణ శాఖలో రూ.7వేల 800 కోట్ల ఆయుధాల కొనుగోలుకు గ్రీన్​సిగ్నల్​

భారత రక్షణ శాఖకి అదనపు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. రూ. 7 వేల 800 కోట్ల విలువైన ఈ కొనుగోళ్లలో ఎంఐ ‌‌– 17 వీ5 హెలికాప్టర్లకు ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్​ వ్యవస్థ కూడా ఉండనుంది. 

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి అనుమతించిన కొనుగోళ్లలో 7.6251 ఎంఎం లైట్​మెషిన్​గన్, నౌకాదళంలోని ఎంహెచ్​– 60 ఆర్​హెలికాప్టర్లకు ఆయుధాల కొనుగోలు వంటివి ఉన్నాయి. 

వీటిలో ఈడబ్ల్యూ వ్యవస్థను భారత్​ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​(బీఈఎల్) నుంచి సేకరించనున్నారు. రక్షణశాఖ బలోపేతానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.