
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి) సీనియర్ నాయకుడు క్షితి గోస్వామి అనారోగ్యం కారణంగా ఆదివారం ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. గోస్వామి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడని.. పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గోస్వామి 80వ దశకం నుంచి 2011 వరకు అంటే రెండు దశాబ్దాలకు పైగా పశ్చిమ బెంగాల్ పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012 నుంచి కొన్నేళ్లపాటు ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు.