
పాలక్కాడ్: కులగణనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు తెలిపింది. సంక్షేమ పథకాలకు దీనిని ఉపయోగించుకోవచ్చని చెప్పింది. ఎన్నికలకు మాత్రం వాడొద్దని హెచ్చరించింది. ఆర్ఎస్ఎస్ మూడ్రోజుల పాటు కేరళలోని పాలక్కాడ్లో నిర్వహించిన సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్‌అంబేకర్ మాట్లాడారు.“కులగణన అనేది సున్నితమైన అంశం. జాతీయ ఐక్యత, సమగ్రతకు ఇది ముఖ్యం. దీన్ని చాలా సీరియస్గా డీల్ చేయాలి. ప్రభుత్వాలు డేటా అవసరాల కోసం దీనిని చేపట్టవచ్చు. గతంలోనూ ఇలాంటివి చేపట్టారు. కుల గణనను ఆ వర్గాలు, కులాల సంక్షేమం కోసమే చేపట్టాలి. దీనిని రాజకీయ సాధనంగా, ఎన్నికల ప్రచారంకోసం ఉపయోగించొద్దు” అని పేర్కొన్నారు.