ఆ దేశాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ కంపల్సరీ : కేంద్ర ఆరోగ్య శాఖ

ఆ దేశాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ కంపల్సరీ : కేంద్ర ఆరోగ్య శాఖ

జనవరి 1, 2023 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణానికి ముందు వారు తమ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. కరోనా కేసులు విదేశాల్లో మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. రెండు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో ముందు నుంచే నివారణ చర్యలు చేపట్టింది. పౌరులంతా మాస్కులు ధరించాలని సూచించింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న 40రోజులు భారత్ కు కీలకమని కేంద్రం ఇటీవలే వెల్లడించింది. జనవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం తదితర ఏర్పాట్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది.