ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సమ్మెలో ఉండటం వల్ల తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుంది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో మల్కాపూర్ వద్ద ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుండి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మల్కాపూర్ వద్ద బైక్ ను ఢీకొట్టింది. అయితే బస్సును అదుపు చేసేందుకు తాత్కాలిక డ్రైవర్ ప్రయత్నించాడు. ప్రయత్నం విఫలమవ్వడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బస్సు ఢీకొట్టడంతో గాయపడ్డ  వాహనదారుణ్ని అస్పత్రికి తరలించారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.