పిట్లం, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ చనిపోగా, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా జుక్కల్మండలం కౌలాస్ సమీపంలో నేషనల్ హైవే 161పై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం 15 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌నుంచి బిచ్కుంద వెళ్తోంది.
కైలాస్గేట్వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోయాడు. కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైవే సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కండక్టర్ ను మద్నూర్హాస్పిటల్ కు తరలించారు.
