గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు సోమవారం ప్రారంభమయ్యాయి. గోదావరిఖని నుంచి 115 బస్సులు, మంథని నుంచి 170 బస్సులు, పెద్దపల్లి నుంచి 175 బస్సులను నడపనున్నట్టు గోదావరిఖని ఆర్టీసీ డీఎం నాగభూషణం తెలిపారు.
గోదావరిఖని నుంచి పెద్దలకు రూ.400, చిన్న పిల్లలకు రూ.230, మంథని నుంచి పెద్దలకు రూ.350, చిన్న పిల్లలకు రూ.210, పెద్దపల్లి నుంచి పెద్దలకు రూ.420, చిన్నపిల్లలకు రూ.240 వసూలు చేయనున్నారు. కాగా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లో మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని డీఎం తెలిపారు.
