సీఎం ప్రసంగం.. ఆర్టీసీ కార్మికుల ఆనంద భాష్పాలు

సీఎం ప్రసంగం.. ఆర్టీసీ కార్మికుల ఆనంద భాష్పాలు

ఆర్టీసి కార్మికులతో సీఎం కేసిఆర్ ఆత్మీయ సమావేశం… ఆద్యంతం ఉద్వేగ భరితంగా జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణం లో సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించారు.

ఆర్టీసిని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలని సీఎం కార్మికులకు సూచించారు. సింగరేణి కార్మికుల మాదిరిగా ప్రతీ ఏటా బోనస్ లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని సీఎం చెప్పారు. సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తామని, ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తామన్నారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్నారు సీఎం.

సీఎం హామీలతో.. సభలో ప్రతి ఒక్కరి కన్నుల్లో ఆనంద భాష్పాలు నింపాయి. నడుమ నడుమ సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు సమావేశంలో ఉన్న ప్రతివొక్కరిని కడుపుబ్బ నవ్వించాయి.  ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ కరతాళ ధ్వనులు హర్షాతిరేకాలతో సమావేశమందిరం దద్దరిల్లింది. సీఎం తమకోసం, తమ పిల్లలకోసం, తమ కుటుంబాల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగుల హృదయాల్లో  ఆనందం చప్పట్ల రూపంలో హాలులో ప్రతిధ్వనించింది.

Related News: చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకి 8 రోజుల్లో ఉద్యోగం

RTC employees very happy with CM KCR speech at pragathi Bhavan