గవర్నర్​ను కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

గవర్నర్​ను కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

హైదరాబాద్ ,వెలుగు : గవర్నర్ తమిళిసైని ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం కలవనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఆమోదించాలని ఆమెను కోరనున్నారు. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమకు అపాయింట్ మెంట్ ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ వెల్లడించారు.

జేఏసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), టీజే ఎంయూ(తెలంగాణ జాతీయ మజ్దూర్ యూని యన్), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ ఎంయూ), ఐఎన్టీయూసీతో పాటు మరో 4 యూనియన్లు ఉన్నాయి. ఆర్టీసీ విలీనం బిల్లు లా సెక్రటరీ రాజ్ భవన్ కు వచ్చినట్లు ఇటీవల గవర్నర్ తమిళిసై వెల్లడించారు.  అసెంబ్లీ లో ప్రవేశపెట్టే ముందు డ్రాఫ్ట్ బిల్ కు 10 సిఫార్సులు తాను సూచించానని, వీటిపై లా సెక్రటరీ వివరణ ఇచ్చారని, వాటిని స్టడీ చేయాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు.