కవితక్క నాయకత్వంలోనే RTC మజ్దూర్ యూనియన్

V6 Velugu Posted on Sep 18, 2021

RTC యూనియన్ లలో గ్రూపులు లేవు,  తగాదాలు లేవన్నారు...తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ థామస్ రెడ్డి. TMU తో RTCకి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ఆర్టీసీలో యూనియన్ లకు ప్రభుత్వం అనుమతించడం సంతోషించదగిన విషయమన్న థామస్ రెడ్డి.. కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. RTCలో కొత్త బస్సులు రావాలన్నారు. కొత్త బస్సులు లేక పోతే ప్రగతి శూన్యం అవుతుందన్నారు.

RTC కార్మికులకు PRC ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు థామస్ రెడ్డి. కవితక్క నాయకత్వం లోనే తెలంగాణ మజ్దూర్ యూనియన్ పనిచేస్తుందని..TMU లో ముందు ఉన్న కమిటీ లే ఉంటాయన్నారు. ఆర్టీసీ లో పని చేస్తున్నా 49 వేల ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేస్తామన్నారు.ఆర్టీసీలో యూనియన్ ల పురోగమనం  రెండేళ్ల తర్వాత  మళ్లీ ఈ రోజు నుంచి  ప్రారంభమయ్యాయన్నారు థామస్ రెడ్డి.

Tagged Thomas Reddy,  RTC Mazdoor Union,  Kavithakka leadership

Latest Videos

Subscribe Now

More News