
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంస్థ యాజమాన్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఆర్టీసీకి సుమారు రూ. 10 వేల కోట్లు కేటాయించాలని ఆ సంస్థ యాజమాన్యం సర్కారుకు ప్రతిపాదనలు పంపించింది. ప్రతి ఏడాది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 5250 కోట్లు ఖర్చు అవుతున్నాయని తెలిపింది. మరో వెయ్యి కొత్త బస్సుల కొనుగోళ్లకు వీలుగా రూ. 1600 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యం చెప్పింది.
ఇక కో ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ ( సీసీఎస్ ) ఆర్టీసీ ఉద్యోగుల నిధి కింద సుమారు రూ. 2 వేల కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ కోసం సుమారు రూ.వెయ్యి కోట్లు అవసరమని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ లెక్కన ఈ బడ్జెట్ లో ఆర్టీసీకి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తేనే ఆర్టీసీ మనుగడ సాధిస్తుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో సంస్థ యాజమాన్యం పేర్కొంది.