ఆర్టీసీ సమ్మె: నిరాహార దీక్ష వాయిదా

ఆర్టీసీ సమ్మె: నిరాహార దీక్ష వాయిదా

ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడోవ రోజుకు చేరింది. సీఎం నిర్ణయంపై మండిపడుతున్నారు కార్మిక సంఘాల నేతలు. సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు. ఆర్టీసీ కార్మికుల కార్యాచరణలో భాగంగా గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించేందుకు వచ్చిన జేఏసీ నేతలు… అక్కడే నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు  ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో కార్మిక సంఘాలు అత్యవసర సమావేశం కానున్నాయి. భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు నేతలు.

మరోవైపు నిరాహార దీక్షను వాయిదా వేసుకున్నాయి కార్మిక సంఘాలు. దీక్షకు పోలీసుల అనుమతి లేకపోవటంతో దీక్షను వాయిదా వేయిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో ఊళ్లలోకి వెళ్లేందుకు సిద్దమైన జనానికి పండగ పూట…. ప్రయాణం కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిపోకపోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు జనం. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ప్రవేటు యాజమాన్యాలు… జనం దగ్గర డబుల్ చార్జీలు వసూల్ చేస్తున్నారు. వాహనాలు అవసరానికంటే ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు.