కాళ్లు విరగ్గొట్టినా… తలలు పగలగొట్టినా.. ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కిన్రు

కాళ్లు విరగ్గొట్టినా… తలలు పగలగొట్టినా..  ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కిన్రు

కార్మికులపై లాఠీ ఛార్జీ…  టియర్​ గ్యాస్​..

సహనం నశించిన కొందరు నిరసనకారుల రాళ్ల దాడి

మహిళలని చూడకుండా రెచ్చిపోయిన పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది కార్మికుల అరెస్టు

కదం కలిపిన స్టూడెంట్లు, ప్రతిపక్ష నేతలు

నాటి మిలియన్​ మార్చ్​ యాదికి తెచ్చిన నిరసన​

బండ్​పైకి వెళ్లిన బీజేపీ నేతలు సంజయ్​, వివేక్​ల అరెస్ట్

ఎటు చూసినా పోలీసులే.. బారికేడ్లు.. ముళ్ల కంచెలు.. అయినా వెనక్కి తగ్గని కార్మికులు.. నలువైపుల నుంచీ ట్యాంక్​బండ్​పైకి వెళ్లేందుకు ప్రయత్నం.. ఎక్కడిక్కడ అరెస్టులు, లాఠీచార్జీలు, టియర్​గ్యాస్​ ప్రయోగం.. తల పగిలి, కాలు విరిగి, తీవ్రంగా దెబ్బలు తగిలి ఆవేదనతో కూలబడ్డ కార్మికులు.. ఆవేశంలో పోలీసులపైకి రాళ్లు రువ్విన కొందరు ఆందోళనకారులు.. ప్రతిక్షణం టెన్షన్​ టెన్షన్.. శనివారం ఉదయం నుంచి సాయంత్రందాకా హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పై కనిపించిన వాతావరణమిది. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన ‘చలో ట్యాంక్​బండ్’ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. అందులో మహిళా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన మిలియన్​ మార్చ్​ను తలపించేలా జరిగింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆర్టీసీ కార్మికులు వేలాదిగా ట్యాంక్​బండ్​పైకి చేరుకున్నారు. వారికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొని.. కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉద్రిక్తత కనిపించింది.

అన్ని వైపులా దిగ్బంధం

ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పిలుపు నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్​బండ్​ను అన్నివైపుల నుంచీ దిగ్బంధించారు. సమీపంలోని రోడ్లన్నీ మూసేశారు. ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. వెయ్యి మందికిపైగా పోలీసులు మోహరించారు. ఏ ఒక్క కార్మికుడు కనిపించినా అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్లకు తరలించారు. బ్యాచ్​లు బ్యాచ్​లుగా వస్తున్నవారిని లాఠీచార్జీలు చేసి చెదరగొట్టారు. దీంతో మధ్యాహ్నం వరకు కూడా కార్మికులు పెద్దగా ట్యాంక్​బండ్​పైకి చేరుకోలేకపోయారు. మరోవైపు శుక్రవారం సాయంత్రం నుంచే రాజకీయ పార్టీల నేతలు, ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్టులు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. దాంతో కార్మికులు, కార్యకర్తలను లీడ్ ​చేసేవారు లేకుండా పోయారు.

ఎక్కడికక్కడ అరెస్టులు

ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి చేరుకున్న కార్మికులు అక్కడే బైఠాయించారు. పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్టు చేసి, వివిధ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు తరలించారు. మహిళా కార్మికులను కూడా ఈడ్చుకెళ్లి వాహనాలు ఎక్కించారు. కొన్ని చోట్ల మగ పోలీసులు మహిళా కార్మికులను అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి చేరుకున్న ఎంపీ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఉదయం నుంచే వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్ చేశారు.

సహనం కోల్పోయి..

పోలీసులు ఇష్టారాజ్యంగా లాఠీచార్జి చేస్తుండటంపై కార్మికులు, పార్టీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో సహనం కోల్పోయి కార్యకర్తలు హిమాయత్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులోని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒకరిద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కాస్త వెనక్కితగ్గినట్టు కనిపించిన పోలీసులు.. మరిన్ని బలగాలను రప్పించి, ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాకెట్లు, హెల్మెట్లు ధరించి మళ్లీ లాఠీచార్జికి సిద్ధమయ్యారు. వజ్ర వాహనాలను తెప్పించి, కార్మికులపైకి పలు రౌండ్లు టియర్​గ్యాస్​ప్రయోగించారు. దాంతో కార్మికులు, నిరసనకారులు వెనక్కితగ్గారు. అదే సమయంలో వారిని తరుముకుంటూ పోలీసులు ముందుకెళ్లారు. జీహెచ్ఎంసీ ఎదురుగా ఉన్న గల్లీల్లోకి, దోమలగూడ కాలనీలోకి చొచ్చుకెళ్లి.. కార్మికులను ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఆ సమయంలో గల్లీలో ఉన్న సాధారణ ప్రజలు, దుకాణాల వారిపైనా దాడి చేశారు. షాపులను బలవంతంగా మూయించేశారు. ఈ సమయంలో చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. చాలా మంది కార్మికులు స్థానికుల ఇండ్లలో, దుకాణాల్లో దాక్కోవాల్సి వచ్చింది. అయితే కొందరు పోలీసులే మఫ్టీలో ఉండి రాళ్లు విసిరారని, ఈ సాకు చెప్పి తమను బద్నాం చేయాలని చూస్తున్నారని కార్మికులు ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత నిర్బంధం లేదు

చలో ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం మరో మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపించింది. అయితే నాడు తెలంగాణ ఉద్యమంలో మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరీ ఇంతగా పోలీసు నిర్బంధం లేదని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కనబడితే కొడుతూ, అరెస్టులు చేస్తూ ఇబ్బందిపెట్టారని నేతలు, కార్మికులు అంటున్నారు. పోలీసుల లాఠీచార్జి, నిరసనకారులు రాళ్లు రువ్వడం, టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయోగం, ఇళ్లు, హాస్టళ్లలో దాచుకోవడం వంటివన్నీ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశాయని పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇంత పెద్ద ఆందోళన జరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.

పైనుంచి చెప్పిండ్రు.. కొట్టక తప్పట్లే!
పోలీసులు లాఠీచార్జి చేయడంపై కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.‘‘మాది ఆకలి పోరాటం అన్నా.. మమ్మల్నికొడితే ఏం వస్తది.. మేం శాం తియుతంగా పోరాడుతున్నం .. ఎందుకొడుతున్నరు’’ అని కార్మికులు బాధపడ్డా రు. కొందరు కార్మికులు పోలీసులకు దండం పెట్టారు.
కాళ్లు మొక్కారు. దీనిపై పోలీసులు కూడా సానుభూతి వ్యక్తం చేశారు. ‘‘మేం కూడా మీ లెక్క ఉద్యోగులమే.. ఇయ్యాల మీకు అయిం ది.. రేపు మాకు కాదని ఏముంది.. మాకు మాత్రం మిమ్మల్ని కొట్టాలని ఉంటదా? పై నుం చి బాగా ఒత్తిడి ఉంది. అందుకే కొట్టక తప్పట్లేదు’’
అని కొందరు పోలీసులు కార్మికులకు చెప్పడం కనిపించింది.

మీడియా వాళ్లపైనా ప్రతాపం

‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమాన్ని కవర్​ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఐడీ కార్డులు చూపించి మీడియా అని చెప్పినా పట్టించుకోకుండా ‘అయితే.. ఏంటి?’అంటూ నెట్టేశారు. ఫొటోలు, వీడియోలు తీయొద్దంటూ హెచ్చరించారు. కార్మికులపై లాఠీచార్జి చేస్తున్న సమయంలో వీడియా తీస్తున్న మీడియా ప్రతినిధులను కొట్టేందుకు ప్రయత్నించారు. లాఠీచార్జికి అనుమతి ఉందా అని ప్రశ్నించిన వీ6 చానల్​ రిపోర్టర్ శివారెడ్డిని, కెమెరామన్ నగేశ్​ను అడిషనల్ డీసీపీ సునీతారెడ్డి, మరికొందరు పోలీసులు లాఠీలతో నెట్టేశారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. వీ6 మరో రిపోర్టర్ శ్రవణ్ ట్యాంక్​బండ్​పైకి వెళ్లి.. రిపోర్ట్​ చేస్తుండగా ‘మీడియా ఇక్కడకు రాకూడదు’అంటూ పోలీసులు తోసేశారు. ట్యాంక్ బండ్ మీద వెంకటస్వామి విగ్రహం ఉన్న పార్క్ లోకి వెళ్లిన కొందరు రిపోర్టర్లను కూడా బయటకు పొమ్మంటూ నెట్టేశారు. ఇక ఓ టీవీ చానల్ కు చెందిన కెమెరామెన్ ను అడ్డుకుని కెమెరాను, ఐడీ కార్డును గుంజుకున్నారు. ఆ కెమెరాను సికింద్రాబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగిచ్చారు. ఇవన్నీ చూసిన సీనియర్​ జర్నలిస్టులు.. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా మీడియా పట్ల పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించలేదు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.