హైదరాబాద్ ఎయిర్ పోర్టులో RTPCR టెస్టులు తప్పని సరి

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో RTPCR టెస్టులు తప్పని సరి

కొత్త వేరియెంట్ తో హైదరాబాద్  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు  అలర్టయ్యారు. వైద్యశాఖ ఆదేశాలతో నిన్న(మంగళవారం) రాత్రి నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే.. వారిని టిమ్స్ కు తరలించనున్నారు. వారి టెస్ట్ రిపోర్ట్ జీనోమ్ సీక్వెన్స్ కనుక్కునేందుకు ల్యాబ్ కు పంపనున్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ ఒమిక్రాన్ లక్షణాలు లేవన్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్షలు ముమ్మరంగా చేస్తున్నారు. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూసరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై నిఘా ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ముప్పు జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి తొలిరోజే RTPCR పరీక్ష నిర్వహించాలని సూచించింది. పాజిటివ్ గా తేలితే జన్యు నమూనాల కోసం ల్యాబ్ పంపాలని గైడ్ లైన్స్ లో పేర్కొంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా.. దేశంలోని అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విదేశీయులను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు.