ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ రెడీ

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ రెడీ
  • యూఎస్ విదేశాంగ మంత్రి వ్యాఖ్య

వాషింగ్టన్: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు  వెల్లడించారు. ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు కూడా పుతిన్ రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఈమేరకు మార్కో రూబియో ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. 

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌, పుతిన్ ఫోన్ కాల్‌‌లో మాట్లాడుకున్నారని,  సమయంలోనే యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు.  పుతిన్, జెలెన్‌‌స్కీ మధ్య ప్రత్యేక్ష చర్చల కోసం తాము కూడా కృషి చేస్తున్నామని.. అది సవ్యంగా జరిగితే ట్రంప్‌‌తో త్రైపాక్షిక సమావేశం కూడా ఉంటుందని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఓ బలమైన శాంతి ఒప్పందం జరగాలని ఆశిస్తున్నట్లు రూబియో పేర్కొన్నారు.