
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని గ్లెండేల్ అకాడమీకి చెందిన తొమ్మిదో క్లాస్ స్టూడెంట్ రుద్రాక్ష్ బన్సాల్ ప్రతిష్టాత్మక ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) - ఫిఫా ఫుట్‌బాల్ అకాడమీకి ఎంపికయ్యాడు. భువనేశ్వర్‌లో ఉన్న ఈ అకాడమీలో చేరేందుకు దేశవ్యాప్తంగా వందలాది మంది పోటీపడ్డారు. ఐదు లెవెల్స్‌లోని కఠినమైన సెలెక్షన్ ప్రాసెస్‌ను రుద్రాక్ష్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. దాంతో తెలంగాణ నుంచి ఫిఫా అకాడమీకి సెలెక్ట్ అయిన ఏకైక స్టూడెంట్‌గా నిలిచాడు. ఫిఫాకు చెందిన ‘గోల్ ప్రాజెక్ట్’లో భాగంగా ఏర్పాటైన ఈ అకాడమీ దేశంలో యువ ఫుట్‌బాల్ టాలెంట్‌ను గుర్తించి, వారికి వరల్డ్ క్లాస్ ట్రెయినింగ్ ఇస్తుంది.