
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తూ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ మాట్లాడుతూ ‘శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి’ అని చెప్పాడు.