కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది రుక్మిణీ వసంత్. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్’. కన్నడ స్టార్ హీరో యష్‌కు జంటగా నటిస్తోంది. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం బెంగళూరులో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ గురించి రుక్మిణీ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ‘టాక్సిక్’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుందని చెప్పింది.
ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో ఉండబోతోందని అనడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. గీతూ మోహన్ దాస్ దర్శకుడిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో నయనతార, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతైరా హీరోయిన్స్‌గా నటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. కానీ ఇప్పటివరకు హీరోయిన్స్ గురించి ఎలాంటి ప్రకటన టీమ్ నుంచి రాలేదు. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
