నవ్వులు పంచే రూల్స్​ రంజన్​ : కిరణ్ అబ్బవరం

నవ్వులు పంచే రూల్స్​ రంజన్​ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా  రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. శనివారం జరిగిన  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.  కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ఇది. నేహాశెట్టి  చాలా సపోర్టివ్ హీరోయిన్. దర్శకుడు రత్నం కృష్ణ పట్టువదలని విక్రమార్కుడు. 

సక్సెస్‌‌ క్రెడిట్‌‌ అంతా ఆయనకే చెందుతుంది’ అని చెప్పాడు. ‘డీజే టిల్లు’లోని రాధిక పాత్ర తర్వాత అంతగా గుర్తింపు తెచ్చే చిత్రమిది అంది నేహాశెట్టి. రత్నం కృష్ణ మాట్లాడుతూ  ‘ఇదొక యూత్‌‌ఫుల్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌.అందరికీ నవ్వులు పంచేలా ఉంటుంది’ అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, కిరణ్ అబ్బవరంతో మరో మూవీని తానే డైరెక్ట్ చేస్తానన్నారు ఏఎం రత్నం. నిర్మాత మురళీ కృష్ణ వేమూరి, హైపర్‌‌ ఆది, సంగీత దర్శకుడు అమ్రిష్‌‌, లిరిసిస్ట్ రాంబాబు గోశాల, ఆర్ట్‌‌ డైరెక్టర్‌‌ సుధీర్‌‌ పాల్గొన్నారు.