ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గత మూడు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువస్థాయికి పడిపోయింది. ఇది శుక్రవారం 89 లెవెల్‌ను దాటింది. ఈ సెషన్‌లో 93 పైసలు పడి 89.61 వద్ద ముగిసింది. గ్లోబల్‌గా ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు, క్రిప్టోకరెన్సీ, ఏఐ టెక్ షేర్ల పతనం, ఇండియా-–అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి రూపాయి బలహీనతకు కారణమని విశ్లేషకులు తెలిపారు.
ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి శుక్రవారం 88.67 వద్ద ప్రారంభమై, 89.65 వరకు పడిపోయింది. ‘‘రూపాయి ఏ స్థాయి వద్ద ఉండాలో ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. డాలర్ డిమాండ్ పెరిగితే రూపాయి పడిపోతుంది”అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం 401 పాయింట్లు పడి 85,232 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 26,068 వద్ద
సెటిలయ్యాయి.
