రూపాయికే క్వార్టర్ మందు.. డైరెక్టర్ శంకర్ అభిమాని ఆఫర్

రూపాయికే క్వార్టర్ మందు.. డైరెక్టర్ శంకర్ అభిమాని ఆఫర్
  • చందాపూర్ లో ఎన్. శంకర్ అభిమాని ఆఫర్

అలంపూర్, వెలుగు: వనపర్తి జిల్లా చందాపూర్ లోని ఓ వైన్ షాపులో ఆదివారం గంటపాటు రూపాయికే క్వార్టర్ లిక్కర్ అమ్మారు. చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు జైబోలో తెలంగాణ సినిమా ఫేం ఎన్. శంకర్ కు వీరాభిమాని. సోమవారం శంకర్ పెళ్లిరోజు సందర్భంగా ఆదివారం చందాపూర్ లో మందుబాబులకు రూపాయికే క్వార్టర్ ఇప్పించారు. వైన్ షాప్ ఎదురుగా బ్యానర్ పెట్టి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు వంద మందికి పైగా ప్రజలకు ఇలా మందు అందిం చారు. అనంతరం జోగులాంబ అమ్మవారి సన్నిధిలో అన్నదానం చేశారు.