
హైదరాబాద్, వెలుగు: కస్టమర్ ఇంటికే వచ్చి బంగారం లోన్ ఇచ్చే సదుపాయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు గోల్డ్‌లోన్ బ్రాండ్ రుపీక్ ప్రకటించింది. ఇది వరకే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, పుణే, అహ్మదాబాద్, కోయంబత్తూరులో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని కంపెనీ తెలిపింది. లెండింగ్ పార్ట్‌నర్లుగా ఐసీఐసీఐ, కరూర్ వైశ్యా, ఫెడరల్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. కేవలం అరగంటలో లోన్ ఇస్తామని, తమ వడ్డీ రేట్లు కూడా తక్కువ ఉంటాయని రుపీక్ సీఈఓ సుమిత్ మనియార్ చెప్పారు.