ప్రమోషన్ పొందిన భాషా పండితులకు న్యాయం చేయాలి..మంత్రి శ్రీధర్ బాబుకు ఆర్యూపీపీ నేతల వినతి

ప్రమోషన్ పొందిన భాషా పండితులకు న్యాయం చేయాలి..మంత్రి శ్రీధర్ బాబుకు ఆర్యూపీపీ నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్ పొందిన లాంగ్వేజీ పండిట్లను, జీవో 317 పరిధిలో స్పౌజ్ కేటగిరీ కింద ఒకే జిల్లాలో సర్దుబాటు చేయాలని ఆర్ యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సిములు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్​లో మంత్రి శ్రీధర్​ బాబును ఆ సంఘం నేతలతో పాటు కలిసి వినతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో 190 గైడ్​లైన్స్​ లోని పదో కాలమ్​ సవరించి, లాంగ్వేజీ పండిట్లకూ తాత్కాలిక డిప్యుటేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిపోయిన లాంగ్వేజీ పండిట్లను అప్​గ్రేడ్ చేయాలని కోరారు.