
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా నాలుగేండ్లపాటు కేంద్ర సర్వీసుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రం నియమించిన పోస్టులో మూడు వారాల్లో జాయిన్ అవ్వాలని ఆమెకు ఆదేశాలు అందాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ఎస్సీ గురుకులాల సెక్రటరీ, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.