120 మిసైళ్లతో ఉక్రెయిన్పై రష్యా దాడి

120 మిసైళ్లతో ఉక్రెయిన్పై రష్యా దాడి

ఉక్రెయిన్ పై రష్యా మారణహోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా సైనిక దాడుల్లో వందలాది మంది అమాయకులు మరణించారు. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొన్నటివరకు పుతిన్ శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు మొగ్గుచూపే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ రష్యా అధ్యక్షుడు అందరి అంచనాలను పటాపంచలుచేస్తూ అందుకు భిన్నంగా రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై 120కిపైగా క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడ్ ల్యాక్ ప్రకటించారు. కీవ్ లో 90శాతానికిపైగా కరెంట్ సరఫరా నిలిచిపోయిందని..ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని ఎల్విన్ మేయర్ ఆండ్రీ సడోవి చెప్పారు. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా రష్యా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. 

ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్‌ను చుట్టుముట్టి మిసైల్స్‌తో రష్యా విరుచుకుపడింది. మరోవైపు.. 120 మిసైల్స్‌ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. ఉక్రెయిన్‌ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే 90 శాతానికిపైగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని.. ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్‌ మేయర్‌ అప్రమత్తం చేశారు.