ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల దాడి..కేబినెట్ భవనం ధ్వంసం

ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల దాడి..కేబినెట్ భవనం ధ్వంసం

శాంతి చర్చలపై ఆశలు సన్నగిల్లడంతో ఉక్రెయిన్ పై రష్యా మరోసారి డ్రోన్లు, మిస్సైళ్ల వర్షం కురిపింది..ఆదివారం(సెప్టెంబర్7) ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది.ఈ దాడుల్లో మంత్రుల కేబినెట్ భవనం ధ్వంసమైంది. ఇద్దరు మృతిచెందారు.. మరో11మంది తీవ్రంగా పడ్డారు. 

కేబినెట్ భవనంలో పెద్ద ఎత్తులన మంటలు చెలరేగాయి. క్షిపణుల దాడిలో కీవ్ అధికారిక భవనం కూల్చేవేశామని రష్యా తెలిపింది. మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి ఉంది.శాంతి చర్చలపై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో రెండు వారాల వ్యవధిలో కీవ్ పై ఇది రెండో భారీ రష్యన్ డ్రోన్, క్షిపణి దాడి. 

►ALSO READ | మోదీ గొప్ప ప్రధాని.. ఆయనతో నేనెప్పుడూ స్నేహంగానే ఉంటా: ట్రంప్

ఉక్రెయిన్ వైమానిక దళాల ప్రకారం.. రష్యా రాత్రి సమయాల్లో 805 డ్రోన్లు, 13 క్షిపణులను ప్రయోగించింది. 
మరోవైపు రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో డ్రుబ్జా చమురు పైపులైన్ పై ఉక్రెయిన్ దాడి చేసింది. హంగరీ, స్లేవేకియాకు రష్యాకు చమురును సరఫరా చేసే రవాణాపైప్ లైన్ ధ్వంసం చేశామని కీవ్ వైమానిక దళం టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది.