4వేలకుపైగా రష్యా సైనికుల్ని హతమార్చినం

4వేలకుపైగా రష్యా సైనికుల్ని హతమార్చినం

ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రష్యాకు చెందిన బలగాలను తమ ఆర్మీ మట్టుబెడుతోందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటి వరకు తమ సైనికులు రష్యా ఆర్మీకి చెందిన 4,300 మందిని హతమార్చినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యార్ ప్రకటించారు. రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులు, 27 యుద్ధ విమానాలు, 26 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఆమె ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. 

మరోవైపు ఉక్రెయిన్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశానికి చెందిన 471మంది సైనికులను బంధీలుగా మార్చినట్లు చెప్పింది. సైనిక చర్య ప్రారంభమైన గురువారం ఉదయం నుంచి ఆదివారం వరకు 975 మిలటరీ బేస్లను ధ్వంసం చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది. ఉక్రెయిన్కు చెందిన 8 ఫైటర్ ప్లేన్లు, 7 హెలికాప్టర్లతో పాటు 11 డ్రోన్లను నేలకూల్చినట్లు వెల్లడించింది. 28ఎయిర్ క్రాఫ్టులతో పాటు 223 యుద్ధ ట్యాంకులను తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

పాలనను విడిచి కిలాడి సీఎంగా మారాడు

హునర్ హాట్ కార్యక్రమంలో కేంద్రమంత్రి అబ్బాస్ నఖ్వీ