రష్యాలోని మఖచ్కలాలో ఆగస్టు 14 అర్థరాత్రి జరిగిన భారీ పేలుడులో 27 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడినట్లు ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ నివేదించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిల్లింగ్ స్టేషన్ ఎదురుగా ఈ పేలుడు సంభవించింది.
నివేదికల ప్రకారం, దగేస్తానీ రాజధానిలోని రహదారి పక్కన ఉన్న ఆటో రిపేరింగ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆపై ఆ మంటలు సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. పేలుడులో గాయపడిన 66 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిప్యూటీ హెడ్ విక్టర్ ఫిసెంకో చెప్పారు. " 66 మంది గాయపడిన వ్యక్తులు మఖచ్కలలోని వైద్యశాలలో ఉన్నారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉంది" అని ఫిసెంకో పేర్కొన్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ TASS తెలిపింది.
ALSO READ : కోతిని రక్షించబోయి విద్యుత్ షాక్తో రైతు మృతి
తాజా సమాచారం ప్రకారం, మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పే పనిలో ఉన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ ఎదురుగా ఈ పేలుడు సంభవించిందని, దీనికి గల కారణాలు త్వరలోనే తెలుస్తాయని డాగేస్తాన్ హెడ్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. ఎనిమిది ఇంధన ట్యాంకుల్లో రెండు పేలినట్లు చెప్పారు. "70 మందికి పైగా సిబ్బంది మంటలను ఆర్పడంలో పాల్గొంటున్నాయి" అని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ ప్రమేయం గురించి ఎటువంటి నివేదికలు లేనప్పటికీ, దీనిపై ఇప్పటికే క్రిమినల్ కేసు ప్రారంభించబమైందని రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రాంతీయ శాఖ నివేదించింది. "డాగేస్తాన్ పరిశోధకులు రష్యన్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 238 కింద క్రిమినల్ కేసును ప్రారంభించారు" అని ఏజెన్సీ వెబ్‌సైట్ తెలిపింది.