భారత్‌తో స్నేహ బంధాన్ని చాటుకున్న రష్యా

భారత్‌తో స్నేహ బంధాన్ని చాటుకున్న రష్యా

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం ఆపాల‌ని అమెరికా,బ్రిట‌న్ , జ‌పాన్ వంటి దేశాలు ఆంక్ష‌ల‌ విధిస్తున్నాయి. అయితే.. ఇండియాతో ర‌ష్యాకి మంచి స్నేహ‌బంధం ఉంద‌ని నిరూపిస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రష్యా అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్న యూఎస్, యూకే, జపాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం ట‌చ్ చేయ‌లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రత‌ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరుకుంది, రష్యా త‌న అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్నఅమెరికా, బ్రిట‌న్‌, జ‌పాన్ జెండాల‌ను తొల‌గించింది. అయితే, రష్యన్లు రాకెట్‌లో భారత జెండాను అలాగే ఉంచారు. రష్యా అంతరిక్ష సంస్థ ROSCOSMOS రాకెట్‌కు మళ్లీ రంగులు వేస్తోంది. కొన్ని జెండాలు లేకుండా రాకెట్ ‘మరింత అందంగా’ కనిపిస్తుంద‌ని తెలిపింది.

క‌జ‌కిస్థాన్ లోని బిక‌నేరు అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం నుంచి ప్ర‌యోగించే స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగ‌స్వామ్యంతో 36 వ‌న్ వెబ్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించ‌నున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిట‌న్, జ‌పాన్ జెండాల‌ను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది. రష్యా అంతరిక్ష సంస్థ ROSCOSMOS చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విష‌యంపై స్పందిస్తూ.. “లాంచర్లు… కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మరింత అందంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు” అని చెప్పారు. దీనికి సంబంధించిన మీడియోను  ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

మంత్రి హత్య కుట్ర డ్రామాకు మూలం కేసీఆరే