నేను అమెరికా అధ్యక్షుడినై ఉంటే యుద్ధం జరిగేది కాదు

నేను అమెరికా అధ్యక్షుడినై ఉంటే యుద్ధం జరిగేది కాదు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది మానవత్వంపై దాడి అని, ఇంతటి దారుణమైన అకృత్యాలు ఎప్పుడూ జరగకూడదని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజల క్షేమం కోసం తాను ప్రార్థిస్తున్నానని అన్నారు. ఫ్లోరిడాలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రష్యా దాడిని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నారని ట్రంప్ అన్నారు. అయితే ఈ సమయంలో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించినా అడ్డుకోకపోవడం దారుణమంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను తప్పుబట్టారు. ఇది చాలా బాధాకరమని అన్నారు. బైడెన్ ను పుతిన్ డ్రమ్ వాయించినట్లుగా వాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, యుద్ధం మొదలయ్యే ముందు ఈ వారం మొదట్లో ట్రంప్ పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. వార్ కు దారి తీసిన రష్యా చర్యలను ఆ సమయంలో ఆయన మెచ్చుకున్నారు. ఉక్రెయిన్ లో రష్యా అనుకూల వేర్పాటువాద పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం చాలా తెలివైన చర్య అంటూ ట్రంప్ ప్రశంసించారు. పైగా పుతిన్ ను శాంతి పరిరక్షకుడు అంటూ కీర్తించారాయన.

మరిన్ని వార్తల కోసం..

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు

దేశం కోసం ఫస్ట్​ టైమ్ ​గన్​ పట్టుకున్నా