దేశం కోసం ఫస్ట్​ టైమ్ ​గన్​ పట్టుకున్నా

దేశం కోసం ఫస్ట్​ టైమ్ ​గన్​ పట్టుకున్నా

రష్యాపై, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌‌పై నాకు చాలా కోపంగా ఉంది. మా దేశ ఉనికిని, హక్కులను ఆయన ఎందుకు కాలరాస్తున్నాడో అర్థం కావడం లేదు. ఊరు విడిచి వెళ్లిపోవాలని నన్ను, నా కుటుంబాన్ని రష్యా సైనికులు బెదిరించారు”అని ఉక్రెయిన్‌‌ ఎంపీ కైరా రూడిక్‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎదో ఒక పని చేసుకొని మాకు బతుకు మేము బతుకుంటే శత్రువులు మా దేశంలోకి వచ్చారు. మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. మా నుంచి శత్రు దేశం ఏమీ తీసుకుపోలేరు. మా దేశం కోసం మేము పోరాడుతాం. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నేను నా భర్త, స్నేహితులు ఫస్ట్‌‌ టైమ్‌‌ ఆయుధాలు పట్టాం. దేశంలోని చాలా మంది మహిళలకు ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇచ్చారు. నా తోటి ఎంపీలు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.ఉక్రెయిన్‌‌ కోసం దేశ ప్రజలంతా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు”అని తెలిపారు.