ప్రధాని మోడీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

ప్రధాని మోడీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

న్యూఢిల్లీ: భారతలో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రిసెర్గీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అంతకు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో కలసి కీలక ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రష్యా మన దేశానికి చాలా తక్కువ ధరకే ఇస్తామని ఆఫర్ చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీ అనంతరం భారత్ తమకు చిరకాల బంధమని రష్యా విదేశాంగ మంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ పంపిన సందేశాన్ని ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా తెలియజేయాలనుకుంటున్నట్లు రష్ఆయా విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచలో అనేక దేశాలు రష్యా వైఖరిని వ్యతిరేకించి తీవ్రమైన ఆంక్షలు విధించి భారత్ పై కూడా ఒత్తిడి తెస్తున్నాయి. రష్యా పట్ల మెతక ధోరణి విడిచిపెట్టాలని.. చైనా వచ్చి దాడి చేస్తే రష్యా మీకు సహాయం చేస్తుందా అని అమెరికా గట్టిగానే హెచ్చరించిన నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం గమనార్హం. చర్చల వివరాలు బయటకు రానప్పటికీ అరగంటకుపైగా జరిగిన చర్చల్లో పలు ప్రతిపాదలు రష్యా భారత్ ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. 


 

 

 

ఇవి కూడా చదవండి

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

సర్కార్ తప్పులు గుర్తు చేసేందుకు ఈనెల 9న యుద్ధభేరి

యుద్ధంపై భారత విధానం బాగుందన్న రష్యా మంత్రి