యుద్ధంపై భారత విధానం బాగుందన్న రష్యా మంత్రి

యుద్ధంపై భారత విధానం బాగుందన్న రష్యా మంత్రి

న్యూఢిల్లీ: ఓ వైపు ఉక్రెయిన్ తో రష్యాం యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్న వేళ రష్యా భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగశాఖ  మంత్రి  సెర్గీ లావ్రోవ్ మన దేశానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్ ఏమడిగినా ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసిన ఆయన తక్కువ ధరకే ముడి చమురు ఇచ్చేందుకు ప్రతిపాదించింది. భారత పర్యటనలో  ఉన్న ఆయన  ఢిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు. దేశంలో ముడిచమురు ధరలు  భారీగా  పెరుగుతుండటంతో  రష్యా విదేశాంగశాఖ  కీలక ప్రాతిపాదనలు  చేసింది.

ఇప్పటికే రష్యా నుంచి 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్ తో కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో మరింత డిస్కౌంట్ ప్రకటించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రూపాయి -రూబుల్ చెల్లింపు విధానం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు  ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో భారత్  వైఖరిని  సమర్ధించిన రష్యా. విదేశాంగ  విధానాన్ని కొనియాడింది. భారత్-రష్యా  వ్యూహాత్మక  భగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు.  

 

 

ఇవి కూడా చదవండి

రాజ్నాథ్సింగ్తో బండి సంజయ్ భేటీ

మీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?

ఎంజీఎంలో ఎలుకల దాడి మా నిర్లక్ష్యమే

మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..