జపోరిజియాపై రష్యా దాడులు.. 17 మంది మృతి

జపోరిజియాపై రష్యా దాడులు.. 17 మంది మృతి

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. జపోరిజియా నగరంపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారు 17 మంది చనిపోయారు. అనేక మంది గాయలపాలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 5 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని.. మరో 40 నివాసాల వరకు ధ్వంసమైనట్లు నగర కౌన్సిల్ సెక్రటరీ తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం సైతం ఈ దాడులను నిర్ధారించింది. కొన్ని రోజులుగా రష్యా జపోరిజియా నగరంపై పదేపదే దాడులకు పాల్పడుతోంది.

రష్యా,క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనపై నిన్న ఉదయం పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. ఈ పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారణకు ఆదేశించారు. వంతెనపైకి వెళ్లే వాహనాలన్నింటినీ అత్యాధునిక పరికరాలతో క్షణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నప్పటికీ పేలుడు ఎలా జరిగిందనే విమర్శలు ఆ దేశ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.