3 గంటల పాటు పుతిన్ కు డాక్టర్ల ట్రీట్​మెంట్

3 గంటల పాటు పుతిన్ కు డాక్టర్ల ట్రీట్​మెంట్

మాస్కో: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు పోయిన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత డాక్టర్లు అత్యవసర ట్రీట్​మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని రష్యన్ టెలిగ్రామ్ చానల్ బుధవారం వెల్లడించింది. ప్రెసిడెన్షియల్ క్వార్టర్​ నుంచి పుతిన్​కు అర్జంట్ మెడికల్ కేర్ అవసరముందని ఫోన్ రావడంతో డాక్టర్లు చేరుకుని మూడు గంటలపాటు పుతిన్​కు ట్రీట్​మెంట్ అందజేశారని తెలిపింది. ప్రెసిడెంట్​కు నయమయ్యాకే డాక్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పింది. అయితే, ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి పుతిన్​ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు టెర్మినల్ క్యాన్సర్ ఉందని, పార్కిన్​సస్​తో బాధపడుతున్నారని అనేక ఏజెన్సీలు ప్రచారం చేశాయి. కానీ, ఆయనకెలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ప్రెసిడెంట్ భవన్ స్పోక్స్ పర్సన్ దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు.