
మాస్కో: రష్యాకు చెందిన కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ ను కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో ఒకరైన వైరాలజిస్ట్ ఆండ్రీ బోటికోవ్ (47) ను గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడు. ఆండ్రీ గొంతుకు బెల్టు బిగించి చంపేశాడు. గురువారం ఆండ్రీ నివాసంలో ఆయన డెడ్ బాడీని కనుగొన్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అరెస్టు చేశామని వారు చెప్పారు. హత్యపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఆండ్రీకి, దుండగుడికి మధ్య జరిగిన వివాదమే హత్యకు కారణమై ఉండవచ్చన్నారు. ఆయనను హత్య చేసిన తర్వాత దుండగుడు పారిపోయాడని తెలిపారు. కాగా, గామాలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమేటిక్స్ లో ఆండ్రీ సీనియర్ రీసెర్చర్‌గా పనిచేశారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొనడంలో కృషి చేసినందుకు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 2021లో ఆయనకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డు ఇచ్చి గౌరవించారు.