చెర్నోబిల్లో పెరిగిన రేడియేషన్..

చెర్నోబిల్లో పెరిగిన రేడియేషన్..

ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. అక్కడ రేడియేషన్ స్థాయిలు పెరగడంతోనే సైన్యం వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారిక విద్యుత్ కంపెనీ ఎనర్జో ఆటమ్ ప్రకటించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తునకు సిద్ధమైనట్లు సమాచారం. 

ఉక్రెయిన్పై సైనికచర్య ప్రారంభించిన మరుసటి రోజే రష్యా సైన్యం చెర్నోబిల్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంది. న్యూక్లియర్ సెంటర్ కు దగ్గరలో కొన్ని కందకాలు తొవ్వింది. ఆ సమయంలో రష్యన్ సైనికులు రేడియేషన్ కు గురై వ్యాధుల బారిన పడ్డారని ఎనర్జో ఆటమ్ సంస్థ అంతర్జాతీయ మీడియాకు తెలిపింది. రేడియేషన్ ప్రభావం పెరగడంతో అప్రమత్తమైన రష్యా బలగాలను వెనక్కి పిలిపించాయి. ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం ఇరినా వెరెచుక్ దీన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ ప్రకటనపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ వద్ద వెలువడుతున్న రేడియేషన్ పై అధ్యయనానికి సిబ్బందిని పంపేందుకు సిద్ధమైంది.

For more news..

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శరత్ కన్నుమూత

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె