రష్యాను ఊపేస్తున్న " సామి సామి" సాంగ్

రష్యాను ఊపేస్తున్న " సామి సామి" సాంగ్

పుష్పా సినిమా రష్యాలోనూ తగ్గెదెలే అంటోంది. ఇండియన్ బాక్సాఫీజు షేక్ చేసి వసూళ్ల సునామిని సృష్టించిన పుష్ప మూవీని డైరెక్టర్ సుకుమార్ రష్యన్ భాషలోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అక్కడ డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యన్ భాషలో విడుదలైన ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డైలాగ్స్, పాటలు రష్యా సినీ అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి.  

ఊపేస్తున్న సామి సాంగ్...

మన దేశంలో పుష్పా సినిమాలోని అన్ని సాంగ్స్  సూపర్ హిట్టయ్యాయి. శ్రీవల్లి, సామి సాంగ్స్ ఉర్రూతలూగించాయి. ఇప్పుడు రష్యాలోనూ ఈ పాటలు అక్కడి ఫ్యాన్స్కు తెగనచ్చేశాయి. ముఖ్యంగా సామి నా సామి పాటకు అక్కడి ఫ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. చిన్నారులు, మహిళలు అన్న తేడా లేకుండా రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళల బృందం  సామి సామి సాంగ్కు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రమోషన్స్ లో బిజీ...

డిసెంబర్ 9న పుష్ప సినిమా రష్యాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ రష్యాకు చేరుకుంది. హీరో అల్లు అర్జున్‌, హీరోయిన్ రష్మిక మందాన, డైరెక్టర్ సుకుమార్‌తో పాటుమరి కొందరు రష్యాలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాస్కోలో రష్యన్‌ లాంగ్వేజ్‌ ప్రీమియర్‌షోను ఏర్పాటు చేశారు. ఈ షోకు రష్యన్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అటు ఈ నెల 3న సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లోనూ మరో ప్రీమియర్‌ షో నిర్వహించనున్నారు.