రుతురాజ్ గైక్వాడ్..ఇంత అహంకారమా..?

రుతురాజ్ గైక్వాడ్..ఇంత అహంకారమా..?

ఆదివారం బెంగుళూరులో భారత్ సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కారణంగా మొదట మ్యాచ్ను  19 ఓవర్ల పాటు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో ఫస్ట్ భారత్ బ్యాటింగ్ కు దిగింది. 3.3 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు చేసిన దశలో..వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. ఇక ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.  

భారీ వర్షంతో గ్రౌండ్ నీటితో నిండిపోయింది. పిచ్ పై కవర్లు కప్పి ఉంచినా..ఔట్ ఫీల్డ్ నీటిమయం అయింది. దీంతో ఎప్పటికప్పుడు వాన నీటిని తొలగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ తీవ్రంగా కృషి చేశారు. వర్షం గ్యాప్ ఇచ్చినప్పుడల్లా..ఔట్ ఫీల్డ్ను మ్యాచ్కు సిద్దం చేయడానికి శ్రమించారు. ఈ సమయంలో ప్లేయర్లంతా డగౌట్లో కూర్చుండిపోయారు. 

మ్యాచ్ మొదలవకముందు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డగౌడ్లో హెల్మెట్ గ్లోవ్స్ ధరించి కూర్చున్నాడు. అయితే గ్రౌండ్ను క్లీన్ చేస్తున్న స్టాఫ్ ఒకరు గైక్వాడ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా..చేత్తో అతన్ని నెట్టేశాడు. దగ్గరకు రానివ్వలేదు. అతన్ని అసహ్యించుకున్నట్లుగా వెళ్లిపోమ్మన్నాడు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. 

వాన పడుతున్న సమయంలో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గ్రౌండ్ స్టాఫ్ పట్ల అహంకార పూరితంగా వ్యవహరించడం ఫ్యాన్స్కు నచ్చలేదు. గైక్వాడ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. 
రుతురాజ్పై  మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన ధోని, రోహిత్, కోహ్లీ వంటి వారు  గ్రౌండ్ స్టాఫ్ పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికట్లోకి వస్తున్న రుతురాజ్ కు ఇంత అహంకారం పనికిరాదంటూ హితబోధ చేస్తున్నారు.