
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సరికొత్తగా మార్చిన మిక్స్‌డ్ డబుల్స్ ఫార్మాట్‌లో ఇగా స్వైటెక్(ఇటలీ)–కాస్పర్ రూడ్ (నార్వే) జోడీ బోణీ చేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ తొలి రౌండ్‌లో మూడోసీడ్ స్వైటెక్–రూడ్ 4–1, 4–2తో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్–ఫ్రాన్సిస్ తియాఫోపై గెలిచారు. బలమైన సర్వీస్‌లు, గ్రౌండ్ స్ట్రోక్స్‌తో ఆకట్టుకున్న ఇటలీ–నార్వే ద్వయం కేవలం 39 నిమిషాల్లోనే ప్రత్యర్థులకు చెక్ పెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో నవోమి ఒసాక (జపాన్)–గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 3–5, 2–4తో మెక్‌నల్లీ (అమెరికా)–ముసెటీ (ఇటలీ) చేతిలో, వీనస్ విలియమ్స్–ఒపెల్కా (అమెరికా) 2–4, 4–5 (4/7)తో ముచోవా–రబ్లెవ్ (చెక్) చేతిలో, రిబకినా (కజకిస్తాన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 2–4, 2–4తో సారా ఎరానీ–వావసోరి (ఇటలీ) చేతిలో ఓడారు.
సరికొత్త మిక్స్‌డ్ డబుల్స్ ఫార్మాట్ ప్రకారం ప్రతి సెట్‌లో నాలుగు గేమ్‌లు మాత్రమే ఉంటాయి. డ్యూస్ తర్వాత ఎటువంటి ప్రయోజనం ఉండదు. తర్వాతి పాయింట్ నెగ్గిన ప్లేయర్‌కు విజేతగా నిలుస్తాడు. మూడో సెట్‌కు బదులుగా 10 పాయింట్ల టైబ్రేక్ ఉంటుంది. మరోవైపు ఇటలీ స్టార్ ప్లేయర్, వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినర్.. ఆఖరి నిమిషంలో మిక్స్‌డ్ డబుల్స్ పోటీల నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య కారణాలతో అతను ఈ మ్యాచ్‌లకు అందుబాటులో లేడని నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. మిక్స్‌డ్‌లో సినియకోవాతో కలిసి సినర్ బరిలోకి దిగాల్సి ఉంది