బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అన్నం గిన్నె మోసిన ఎస్ఐ

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అన్నం గిన్నె మోసిన ఎస్ఐ

లాఠీ పట్టాల్సిన చేతులు అన్నం గిన్నెలు మోశాయి.. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ స్వయంగా గిన్నెలు మోసి ఆకలి తీర్చారు.. తప్పులేదు.. ఆపదలో ఆసరాగా నిలిస్తే హ్యాట్సాప్ అంటాం.. ఇక్కడ సిట్యువేషన్ భిన్నంగా ఉండటం వల్లే చర్చనీయాంశం అయ్యింది. ఈ ఫొటోనే ఇప్పుడు వైరల్ అయ్యింది.. భారత రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పార్టీపై పోలీసులు ఎంత భక్తి చూపిస్తున్నారనేది ఈ ఫొటోనే చెబుతుంది.. అసలు వివరాల్లోకి వెళితే...

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో భోజనాలు కూడా ఉన్నాయి.. వంట గది నుంచి డైనింగ్ ఏరియాకు అనర్నం గెన్నెలు తీసుకొచ్చే సమయంలో.. హుజూర్ నగర్ ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి స్వయంగా అన్నం గిన్నెలను మోశారు. అక్కడ ఎవరూ లేరా అంటే.. వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అయినా ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి స్వయంగా అన్నెం గిన్నెలు మోసి.. పార్టీపై భక్తిని చాటుకున్నట్లు ఫొటో సాక్ష్యం అంటున్నారు నెటిజన్లు.  

ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి గారు శాంతి భద్రతలు కాపాడే పోలీసుగా కంటే.. బీఆర్ఎస్ కార్యకర్తగా మారిన వైనం చూడండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోయింది. పార్టీ కార్యకర్తగా అన్నెం గిన్నెలు పోటీ పడి మరీ మోస్తే.. జనానికి ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్స్ లో అత్యధిక ఫార్వర్డ్స్ అవుతుంది ఈ ఫొటో.. చూడండి.. చూడండి.. బీఆర్ఎస్ కార్యకర్తగా మారిన హుజూర్ నగర్ ఎస్సై అంటూ నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు.