దర్శకధీరుడు రాజమౌళి ఒప్పో యాడ్ .. కాన్సెప్ట్ ఎవరిదో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి ఒప్పో యాడ్ .. కాన్సెప్ట్ ఎవరిదో తెలుసా?

దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli).. సీరియల్ డైరెక్ట్ చేసే స్థాయి నుండి ప్రపంచాన్నికి తన సత్తా  తెలియజేసే సినిమాల వరకు ఎదుగుతూ వస్తున్నారు. రీసెంట్ గా ఒప్పో రెనో 10(Oppo Reno 10 Series) యాడ్ లో నటించిన రాజమౌళిని చూసి.. ప్రతి ఒక్కరు తన నుంచి ఇంకా ఎంతో నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ యాడ్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుంది.  

Oppo Reno 10 సిరీస్ ప్రచారంలో చిత్రనిర్మాత SS రాజమౌళి టెలిఫోటో కెమెరా సాంకేతికత యొక్క అద్భుతాలను హైలైట్ చేస్తూ కెమెరా  ముందు డైరెక్షన్ రోల్ చేయగా..అన్ని భాషల హీరోస్ ఇటువంటి యాడ్ చేయాలని చూపించారు. ఇప్పుడు  ఈ యాడ్ ను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. అసలు ఈ యాడ్ వెనుక ఉన్నది బ్రిటన్ కు చెందిన బార్ట్లీ బోగ్లే హేగర్టీ అనే ఒక ప్రముఖ కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోంది. చాలా మంది జక్కన్నకోసం ఈ యాడ్ చూశామంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. 

ముందుగా  ఈ యాడ్ ప్రమోషన్ కు  రాజమౌళిని ఎంచుకోవడం గురించి కంపెనీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ పరిక్షిత్ భట్టాచార్య మాట్లాడుతూ “మేము Oppo Reno 10 సిరీస్‌లో కెమెరాను దర్శకుడి సాధనంగా ఉంచాలనుకుంటున్నాము. ఈ ప్రచారానికి ఒప్పోతో రాజమౌళి లాంటి వారిని అసోసియేట్ చేయడం వల్ల మేము ఈ సందేశాన్ని అందంగా మరియు సమర్థవంతంగా నడిపించగలుగుతాము" అంటూ పేర్కోన్నారు. 

జక్కన్న ఫోన్‌తో షూట్ చేసిన ప్రతి ఒక్క షార్ట్ ఎంతో నేర్పిస్తుంది. డైరెక్షన్ ఎలా మొదలు పెట్టాలో..మాస్టర్‌గా ఎలా మారాలో..సృజనాత్మక నైపుణ్యాన్ని యాక్సెస్ ఎలా చేసుకోవాలో.. ఒప్పో రెనో 10 లాంటి మొబైల్స్ ప్లాట్ ఫామ్ అవసరం అంటూ దర్శక ధీరుడి ఉదేశ్యం అని ఫ్యాన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు.