పంద్రాగస్టున సాహో రిలీజ్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

పంద్రాగస్టున సాహో రిలీజ్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

ప్రభాస్ చెప్పినట్టుగానే సాహో సర్ ప్రైజ్ వచ్చేసింది ఇవాళ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం… సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. స్టైలిష్ గా గ్లాసెస్ పెట్టుకున్న ప్రభాస్ సీరియస్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో చిత్రయూనిట్ విడుదలచేసింది. రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశాడు. ఆగస్టు 15న థియేటర్లో కలుద్దామంటూ పోస్ట్ చేశాడు.

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అంటున్న చిత్రయూనిట్

దేశంలోనే ఇలాంటి యాక్షన్ మూవీ ఇంతవరకు రాలేదనీ… సాహో టీమ్ చెబుతోంది. ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. సుజీత్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా శ్రద్దాకపూర్ నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్లతో యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.