థియేటర్లలోకి సెప్టెంబర్ 16న 'శాకిని డాకిని'

థియేటర్లలోకి సెప్టెంబర్ 16న 'శాకిని డాకిని'

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ మెయిన్ లీడ్ లో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ  తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. కొరియ‌న్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగాఈ సినిమాను  నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న చిత్రాన్ని థియేటర్లలో  విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.

ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేదా చాలా సీరియస్ లుక్ లో  కనిపిస్తున్నారు.  కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి.  ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  మిక్కీ ఎంసీ క్లియ‌రీ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.