ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే..

ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే..

నిర్మాతగా సక్సెస్, ఫెయిల్యూర్స్‌‌ రెండూ ఉంటాయని,  అయితే ‘సామజవరగమన’ విజయం కాన్ఫిడెన్స్‌‌ పెంచిందన్నారు అనిల్ సుంకర. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ ‘ఈ విజయంపై ముందు నుంచి నమ్మకం ఉంది. ఈ కథని నా దగ్గరకి పంపించిన సందీప్‌‌కి థ్యాంక్స్. ఈ పాత్రకు శ్రీవిష్ణు యాప్ట్. చాలా ఇంప్రొవైజ్ చేశాడు. ఇలాంటి కథ మరోసారి చేయాలంటే.. నా ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే. అలాగే నరేష్ గారి పాత్ర కూడా హిలేరియస్. ప్రీమియర్స్ ప్లస్ అయ్యాయి. ముందు రోజు నైజాంలో ఇరవై షోలు పడ్డాయి. పది లక్షల షేర్ వచ్చింది. 

Also Read : కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ ​చేయాలి

దీంతో మాకు నమ్మకం పెరిగింది. ఈ విజయం చాలా తృప్తిని ఇచ్చింది. ఇదే కాంబినేషన్‌‌లో మళ్ళీ సినిమా ఉంటుంది. అలాగే తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ విషయంలో అందరిది తప్పు ఉంది. బౌండ్ స్క్రిప్ట్‌‌తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించకూడదు. నిర్మాతగా  ఫలితానికి బాధ్యత వహిస్తాను.  ఇక నేను నిర్మించిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది. ఇది కూడా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. తర్వాత అశ్విన్ బాబు ‘హిడింబ’, సందీప్ కిషన్ ‘ఊరుపేరు భైరవ కోన’ విడుదలకు రెడీగా ఉన్నాయి’ అని  చెప్పారు.