
వరలక్ష్మి శరత్ కుమార్ ఫిమేల్ లీడ్‌గా నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 3న విడుదల చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ‘శబరి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఇందులోని యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి’ అని చెప్పింది. నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి’ అని చెప్పారు.